జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల్లో విష్ణువర్ధన్‌రెడ్డిచే నామినేషన్‌ వేయించిన బీఆర్ఎస్

Telugu Lo Computer
0


హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్ నామినేషన్లు వేశాయి. బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి నామినేషన్ వేయనున్నారు. కాగా కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత బరిలో ఉన్న విషయం తెలిసిందే. కాగా ఈ ఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎలాంటి పొరపాట్లు జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్త పడుతున్నాయి. ఈ క్రమంలోనే భారత రాష్ట్రసమితి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్రెడ్డితోనూ నామినేషన్ వేయించింది. ఇప్పటికే ఆ పార్టీ తరఫున మాగంటి సునీత మూడు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. అయితే, నామినేషన్ తిరస్కరణకు గురైతే ఇబ్బందులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ముందు జాగ్రత్తగా విష్ణువర్ధన్ రెడ్డితోనూ భారత రాష్ట్ర సమితి నేతలు నామినేషన్ వేయించినట్లు చెబుతున్నారు. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేసేందుకు 40 మంది క్యాంపైనర్లతో ఆ పార్టీ లిస్ట్ విడుదల చేసింది. ఆ జాబితాలో ప్రముఖ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా ఈ లిస్టులో ఉండటం గమనార్హం. 

Post a Comment

0Comments

Post a Comment (0)