భారతీయ రైల్వే చరిత్రలో సరికొత్త రికార్డు : ఒకేరోజు కోటి ఎనిమిది లక్షల రూపాయల జరిమానా వసూలు !

Telugu Lo Computer
0


క్కరోజు రైళ్లలో జరిపిన తనిఖీలలో రైల్వే చరిత్రలోనే తొలిసారిగా కోటి ఎనిమిది లక్షల రూపాయల జరిమానా వసూలు అయింది. టికెట్ లేకుండా రైళ్లలో ప్రయాణిస్తున్న వారిపై రైల్వే అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ ఇతి పాండే ఆదేశాలతో తనిఖీలు చేసిన రైల్వే అధికారులు టికెట్ లేకుండా ప్రయాణం చేస్తున్న ప్రయాణికుల వద్ద నుండి జరిమానాలు వసూలు చేశారు. ఒక్కరోజులోనే ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని రైళ్లలో లభించింది. అలాగే టికెట్ లేకుండా ప్రయాణం చేసిన వారిపై మొత్తం 16,105 కేసులు నమోదు చేశారు. సాధారణంగా జోన్ పరిధిలో రోజువారి టికెట్లను తనిఖీ చేస్తే సుమారు 47లక్షల రూపాయల ఆదాయం వస్తుంది. కానీ దక్షిణ మధ్య రైల్వే పరిధిలో భారతీయ రైల్వే చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది . టికెట్ లేకుండా ప్రయాణిస్తున్న ప్రతి ప్రయాణికుల నుండి ఫైన్ వసూలు చేయగా ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు జరిమానా వసూలు అయింది. ఈ జరిమానా వసూళ్లలో విజయవాడ డివిజన్ ముందు వరుసలో ఉంది. విజయవాడ డివిజన్ లో 36.91 లక్షల రూపాయలు వసూలయ్యాయి. సికింద్రాబాద్ డివిజన్ నుండి 27.9 లక్షలు, గుంతకల్లు డివిజన్ నుంచి 28 లక్షలు, గుంటూరు డివిజన్ పరిధిలో 6.46 లక్షలు, హైదరాబాద్ డివిజన్ లో 4.6 లక్షలు, నాందేడ్ డివిజన్ నుంచి 4.8 లక్షలు చొప్పున అధికారులు జరిమానా వసూలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)