జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కేఏ పాల్ పోటీ

Telugu Lo Computer
0


జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో ప్రశాంతి పార్టీ కూడా పోటీ చేస్తుందని ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కేఏ పాల్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ తనను పోటీ చేయమని నియోజకవర్గ ప్రజలు కోరుతున్నారని కేఏ పాల్ తెలిపారు. ఉప ఎన్నికలో విజయం సాధించి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటానని వెల్లడించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు ప్రజాశాంతి పార్టీని గెలిపిస్తే నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మ్యానిఫెస్టోను విడుదల చేశారు. ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్, భారత రాష్ట్ర సమితి తరఫున సునీత బరిలో నిలిచారు. బీజేపీ అభ్యర్థి ఇంకా ఖరారవలేదు. బీజేపీ అభ్యర్థి కూడా ఖరారైన తర్వాత ఒక్కసారిగా రాజకీయం వేడెక్కే అవకాశం ఉంది. నవంబర్ 11వ తేదీన ఈ నియోజకవర్గానికి ఉపఎన్నిక జరుగనుంది. ఈ ఉప ఎన్నికను దృష్టిలో ఉంచుకుని ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులపై కసరత్తు పూర్తి చేయగా సోమవారం నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది

Post a Comment

0Comments

Post a Comment (0)