కారులో హఠాత్తుగా ఎయిర్‌ బెలూన్‌ తెరుచుకోవడంతో ఆరేళ్ల పిల్లాడు దుర్మరణం

Telugu Lo Computer
0


మిళనాడులోని కల్పకం సమీపంలోని పుదుపట్టిణం గ్రామానిక చెందిన వీరముత్తు, తన భార్య, కుమారుడు, మరో ఇద్దరితో కలిసి సోమవారం రాత్రి రెంటల్ కారులో చెన్నైకి బయలు దేరారు. విఘ్నేష్ (26) అనే డ్రైవర్ కారు నడుపుతున్నాడు. వీరముత్తు తన ఆరేళ్ల కొడుకు కవిన్‌ను ఒళ్లో పెట్టుకుని ముందు సీట్లో కూర్చుకున్నాడు. తిరుపోరూర్‌ సమీపంలోని ఆలత్తూర్‌ పెట్రోల్‌ బంక్‌ వద్ద ముందెళున్న కారును వెనుక నుంచి వీరు ప్రయాణిస్తున్న కారు ఢీకొట్టింది. ఒక్కసారిగా కారులోని ఎయిర్‌బ్యాగ్ కవిన్ ముఖంపై వేగంగా తెరుచుకోవడంతో అతడు కుప్పకూలిపోయాడు. బాలుడిని వెంటనే తిరుపోరూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాలుడిని పరీక్షించిన వైద్యుడు అప్పటికే మృతి చెందినట్లు చెప్పాడు. కుమారుడి ఆకస్మిక మరణంతో వీరముత్తు, అతడి భార్య హతాశులయ్యారు.ముందు వెళ్లిన కారు ఎటువంటి సిగ్నల్ ఇవ్వకుండా సడన్‌గా కుడివైపు తిరగడంతో ప్రమాదం సంభవించిందని పోలీసులు గుర్తించారు. ఇందులో ఉన్న వ్యక్తిని తిరుపోరూర్‌ సమీపం పయ్యనూర్‌ గ్రామానికి చెందిన సురేష్‌ (48)గా గుర్తించారు. అతడు కారులో పయ్యనూర్‌ నుంచి తిరుపోరూర్‌ వెళుతున్నట్టు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా కారు నడిపి బాలుడి మరణానికి కారణమయ్యాడనే ఆరోపణలతో సురేష్‌పై తిరుపోరూర్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)