రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డులో ఒకదానినొకటి ఢీకొన్న ఏడు కార్లు

Telugu Lo Computer
0


హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్ ఔటర్ రింగ్ రోడ్డులో ఏడు కార్లు ఒకదానినొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కార్లు దెబ్బతిన్నాయి. అందులోని ప్రయాణికులకు గాయాలయ్యాయి. కార్లలోని ప్రయాణికులతో పాటు ఇతర వాహనదారులు గాయపడ్డారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆదివారం ఓ కారు డ్రైవర్ మితిమీరిన వేగంతో వెళ్లి ఒక్కసారి బ్రేక్ వేశాడు. దీంతో దాని వెనుక వస్తున్న ఏడుకార్లు వరుసగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ​ప్రమాదంపై సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని అత్యవసర చికిత్స కోసం సమీప ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)