ప్రమాదానికి గురైన విజయ్ దేవరకొండ కారు : మేమంతా బాగానే ఉన్నామని విజయ్ ఎక్స్ లో పోస్ట్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పుట్టపర్తిలో సత్యసాయి మహా సమాధిని దర్శించుకుని తిరిగి వస్తుండగా జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి దగ్గరలో విజయ్ దేవరకొండ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం నుంచి విజయ్ దేవరకొండ సురక్షితంగా తప్పించుకున్నారు. కారు మాత్రం దెబ్బతింది. విజయ్ కారును ఎదురుగా వస్తున్న బొలెరో వాహనం ఢీకొట్టడంతో ఈ ప్రమాదంజరిగింది. విజయ్‌ కారు డ్రైవర్‌ అందె శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఉండవల్లి ఎస్.ఐ ఆర్.శేఖర్ తెలిపారు. పుట్టపర్తిలోనే చదువుకున్న విజయ్ దేవరకొండకు సత్యసాయి అంటే నమ్మకం ఎక్కువ. మరోవైపు తనకు ఏమీ కాలేదని విజయ్ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అంతా బాగానే ఉంది, కారు మాత్రమే దెబ్బతింది. మేమంతా బాగానే ఉన్నాము. స్ట్రెంగ్త్ వర్కౌట్స్ కూడా చేసి ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను. మీ అందరికీ నా ప్రేమ, హగ్స్ అంటూ విజయ్ రాసుకొచ్చాడు. ఈ వార్త మిమ్మల్ని ఒత్తిడికి గురిచేయనివ్వకండి అంటూ ఎక్స్ లో విజయ్ పోస్ట్ పెట్టాడు. 

Post a Comment

0Comments

Post a Comment (0)