హైదరాబాద్‌లో ఫేక్ ఎన్జీవో లోన్ స్కామ్ వెలుగులోకి వచ్చింది. ఈ స్కాంలో రూ.7.9 లక్షలు బేగంపేటకు చెందిన 30 ఏళ్ల వ్యక్తి మోసపోయాడు. వాట్సాప్ కాల్‌లో హెచ్ వైసీ ఫౌండర్ సల్మాన్ ఖాన్ డీపీతో ఓ వ్యక్తి రూ.50 లక్షల లోన్ హామీ ఇచ్చాడు. మొదటగా రూ.10 లక్షలు కట్టాలని అడిగాడు. ఆతర్వాత లోనుకి కావాల్సిన డబ్బు ఇస్తానని నమ్మబలికాడు. ఇది నిజమనుకున్న బాధితుడు రూ.7.9లక్షలు కట్టాడు. ఆ తర్వాత బాధితుడిని నేరగాళ్లు మోసం చేశారు. చివరికి మోసపోయినట్లు గ్రహించి బాధితుడు బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అపరిచిత ఎన్జీవో/వ్యక్తుల లోన్ ఆఫర్లను నమ్మవద్దని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు. ముందస్తు ఫీజులు, టాక్స్‌లు కట్టవద్దని తెలిపారు. సెలబ్రిటీ డీపీలు లేదా అనుమానాస్పద అకౌంట్లపై అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ధ్రువీకరించిన రిజిస్టర్ సంస్థల ద్వారా మాత్రమే లోన్ అభ్యర్థించాలని సూచించారు. సైబర్ క్రైమ్ మోసం జరిగితే 1930 డయల్ లేదా cybercrime.gov.in ఫిర్యాదు చేయాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.
హైదరాబాద్‌లో వెలుగులోకి వచ్చిన ఫేక్ ఎన్జీవో లోన్ స్కామ్ !
October 14, 2025
0
Tags