తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం జూబ్లీహిల్స్ లోని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి నివాసానికి వెళ్లి ఆయన భౌతికాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సీపీఐ అగ్రనేత నారాయణ, సిపిఎం సాంబశివరావు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రైతు సంక్షేమ కమిషన్ సభ్యులు చెవిటి వెంకన్న, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యే మందుల సామేల్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిషోర్ కుమార్, సంకినేని వెంకటేశ్వరరావు, సూర్యాపేట జడ్పీ మాజీ చైర్పర్సన్ గుజ్జ దీపిక యుగేందర్ రావు, కాంగ్రెస్ పార్టీ సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు తిరుమలప్రగడ అనురాధ, ఆరాధ్య ఫౌండేషన్ చైర్ పర్సన్ తాడోజు వాణి శ్రీకాంతరాజు, తదితరులు సంతాపం ప్రకటించిన వారిలో ఉన్నారు. గాంధీభవన్ లో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు. అలాగే వివిధ రాజకీయ పక్షాల నేతలు, అధికార, ప్రతిపక్ష ప్రతినిధులు సంతాపం ప్రకటించిన వారిలో ఉన్నారు.
రాంరెడ్డి దామోదర్ రెడ్డి భౌతికాయానికి నివాళులర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
October 03, 2025
0
Tags