సినిమా షూటింగులో పడవ బోల్తా పడి నీట మునిగిన కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు !

Telugu Lo Computer
0


మిళ నటుడు సూరి హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం 'మండాడి'. తెలుగు హీరో సుహాస్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇదే సినిమా తెలుగులో వచ్చేసరికి సుహాస్ హీరోగా సూరి విలన్‌గా కనిపించనున్నాడు. కాగా ఈ చిత్రం షూటింగ్ చెన్నై సముద్ర తీరంలో శర వేగంగా జరుగుతోంది. ఈ క్రమంలో షూటింగులో అపశృతి చోటుచేసుకుంది. ఈ చిత్ర షూటింగులో భాగంగా కొన్ని సన్నివేశాలను సముద్రంలో చిత్రీకరిస్తుండగా, సాంకేతిక నిపుణులు ఉన్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కోటి రూపాయల విలువ చేసే కెమెరాలు, ఇద్దరు వ్యక్తులు నీట మునిగిపోయారు. రామనాథ పురం జిల్లా తొండి సముద్రతీర ప్రాంతంలో ఈ ప్రమాదం సంభవించింది. అయితే, యూనిట్ సభ్యులు నీట మునిగిన వ్యక్తులను రక్షించడంతో ప్రాణనష్టం తప్పింది. అయితే విలువైన కెమెరాల సహా ఇతర సామాగ్రి నీట మునిగిపోయింది. ఇదిలాఉంటే ఈ సినిమాను జాతీయ అవార్డు గ్రహాత వెట్రిమారన్ నిర్మిస్తుండడం విశేషం.

Post a Comment

0Comments

Post a Comment (0)