ఆంధ్రప్రదేశ్‌లోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఇవన్నీ ఒకే సంస్థ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా మారనున్నాయి. ఈ విలీన ప్రక్రియకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఒక సర్క్యులర్ విడుదల చేసింది. నాలుగు గ్రామీణ బ్యాంకుల్ని సాంకేతికంగా విలీనం చేసే ప్రక్రియలో భాగంగా ఈ బ్యాంకింగ్ సేవలు చాలా వరకు సుమారు ఐదు రోజుల పాటు అందుబాటులో ఉండవని స్పష్టం చేసింది. 'ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకుల్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో సాంకేతికంగా విలీనం చేయనున్న నేపథ్యంలో అక్టోబర్ 9 సాయంత్రం 6 గంటల నుంచి.. అక్టోబర్ 13 ఉదయం 10 గంటల వరకు మా పూర్వ బ్యాంకుల సేవలు (ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకు) తాత్కాలికంగా అందుబాటులో ఉండవు.' అని బ్యాంక్ తన అధికారిక వెబ్‌సైట్‌లో పేర్కొంది. బ్యాంక్ బ్రాంచ్‌లతో పాటు.. మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఐఎంపీఎస్, ఏటీఎం సేవలు, బ్యాంక్ మిత్రలు కూడా అందుబాటులో ఉండబోవని స్పష్టం చేసింది. ఇక్కడ అక్టోబర్ 11 రెండో శనివారం, 12 ఆదివారం బ్యాంకులకు హాలిడే అయినప్పటికీ.. ఇక్కడ ఈ రోజుల్లోనూ ఆన్‌లైన్ సేవలు పొందలేరు. ఏటీఎం సేవలు అందుబాటులో ఉండవు. అంటే మొత్తంగా 5 రోజుల పాటు పూర్తిగా ఈ గ్రామీణ బ్యాంకుల సేవలు పొందలేరని చెప్పొచ్చు. మరి అక్టోబర్ 13 వ తేదీ తర్వాత ఏం చేయాలో ఆయా గ్రామీణ బ్యాంకుల కస్టమర్లకు మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది.
ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు బ్యాంకులు విలీనం : ఐదు రోజులు బ్యాంక్ సేవలు బంద్
October 09, 2025
0
Tags