దేశీయ మార్కెట్లో అక్టోబర్ 7న వివో వి60ఈ విడుదల కానున్నది. వివో అధికారిక వెబ్‌సైట్, సోషల్ మీడియా ప్రచారాలతో హైప్ క్రియేట్ చేస్తోంది. డిజైన్ పరంగా ఇది వివో వి60ను పోలి ఉన్నప్పటికీ, కొత్త కర్వ్డ్ ఛాసిస్, ఐఫోన్ 16/17 తరహా నిలువు కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంది. సన్నని బాడీ, తేలికైన ఛాసిస్, 6,500mAh భారీ బ్యాటరీని ఇంత సన్నని డిజైన్‌లో అమర్చడం దీని ప్రత్యేకత. దీని ఛార్జర్ బాక్స్‌లోనే వస్తుంది. దీర్ఘకాలిక బ్యాకప్‌తో పాటు, తక్కువ సమయంలో ఛార్జింగ్ పూర్తి చేసుకునే సౌలభ్యం లభిస్తుంది. కెమెరా సెటప్ పరంగా 200MP అల్ట్రా HD ప్రైమరీ కెమెరా (OIS సపోర్ట్‌తో), 85mm క్లోజప్ పోర్ట్రెయిట్ మోడ్, AI ఫెస్టివల్ పోర్ట్రెయిట్ మోడ్, 8MP అల్ట్రావైడ్ లెన్స్, 50MP సెల్ఫీ కెమెరా (Eye Autofocus టెక్నాలజీతో) వస్తుంది. ఈ ఫీచర్లు ఫోటోగ్రఫీ ప్రేమికులకు DSLR స్థాయి అనుభూతి ఇవ్వనున్నాయి.
అక్టోబర్ 7న వివో వి60ఈ విడుదల
October 02, 2025
0
Tags