టెస్ట్ క్రికెట్‌లో చరిత్ర సృష్టించిన టీమిండియా : 65 ఏళ్లలో ఇదే తొలిసారి

Telugu Lo Computer
0


న్యూఢిల్లీ వేదికగా వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌ తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 65 ఏళ్ల తర్వాత వెస్టిండీస్‌పై వరుసగా ఐదు వికెట్లకు 50 ప్లస్ భాగస్వామ్యాలను నమోదు చేసిన జట్టుగా భారత్ అరుదైన రికార్డ్‌ నమోదు చేసింది.సాధించింది. ఈ ఇన్నింగ్స్‌లో టీమిండియా టాప్-ఐదుగురు బ్యాటర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్, నితీష్ కుమార్ రెడ్డి, ధృవ్ జురెల్ వరుసగా ఐదు వికెట్లకు 50+ రన్స్ పార్ట్‌నర్‌షిప్స్ అందించారు. తొలి వికెట్‌కు రాహుల్-జైస్వాల్ 58, రెండో వికెట్‌కు జైస్వాల్-సాయి సుదర్శన్ 193, మూడో వికెట్‌కు జైస్వాల్-శుభ్‌మన్ గిల్ 69, నాలుగో వికెట్‌కు శుభ్‌మన్ గిల్-నితీష్ కుమార్ రెడ్డి 91, ఐదో వికెట్‌కు శుభ్‌మన్ గిల్-ధ్రువ్ జురెల్ 102 పరుగుల భాగస్వామ్యాలను నమోదు చేశారు. 1960 తర్వాత వెస్టిండీస్ జట్టుపై ఒక టీమ్ వరుసగా ఐదు వికెట్లకు 50 ప్లస్ రన్స్ పార్ట్‌నర్‌షిప్స్ నమోదవ్వడం ఇదే తొలిసారి. గతంలో ఈ రికార్డ్‌ను వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా నమోదు చేసింది. 1960లో బ్రిస్బేన్ వేదికగా జరిగిన గబ్బా టెస్ట్‌లో ఆసీస్ ఈ ఫీట్ సాధించింది. 93 ఏళ్ల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియా ఈ ఫీట్ సాధించడం మూడో సారి. 1993లో తొలిసారి, 2023లో ఆస్ట్రేలియాపై రెండో సారి టీమిండియా వరుసగా 5 వికెట్లకు 50 ప్లస్ రన్స్ భాగస్వామ్యాలను నమోదు చేసింది. తాజాగా మరోసారి ఈ ఫీట్ అందుకుంది.

ఈ మ్యాచ్‌లో టీమిండియా పట్టు బిగించింది. రవీంద్ర జడేజా(3/98) తీన్మార్ బౌలింగ్‌తో రెండో రోజు ఆట ముగిసే సమయానికి వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 43 ఓవర్లలో 4 వికెట్లకు 140 పరుగులు చేసింది. షైహోప్(46 బంతుల్లో 5 ఫోర్లతో 31 బ్యాటింగ్), టెవిన్ ఇమ్లాచ్(14 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. జడేజాతో పాటు కుల్దీప్ ఒక వికెట్ తీసాడు. విండీస్ ఇంకా 378 పరుగుల వెనుకంజలో ఉంది. అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 134.2 ఓవర్లలో 5 వికెట్లకు 518 పరుగుల భారీ స్కోర్ వద్ద డిక్లేర్ చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్(258 బంతుల్లో 22 ఫోర్లతో 175), శుభ్‌మన్ గిల్(196 బంతుల్లో 2 సిక్స్‌లతో 16 ఫోర్లతో 129 నాటౌట్) శతకాలతో చెలరేగారు. నితీష్ కుమార్ రెడ్డి(54 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ధ్రువ్ జురెల్(79 బంతుల్లో 5 ఫోర్లతో 44), కేఎల్ రాహుల్(54 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 38) హాఫ్ సెంచరీలు చేజార్చుకున్నారు. వెస్టిండీస్ బౌలర్లలో జొమెల్ వారికన్(3/98) మూడు వికెట్లు తీయగా.. రోస్టన్ ఛేజ్ ఓ వికెట్ పడగొట్టాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)