నాగార్జునసాగర్ డ్యామ్‌కు వరద ప్రవాహం కొనసాగుతున్నది. దీంతో అధికారులు 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 2.70 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, అంతే మొత్తంలో దిగువకు వెళ్తున్నది. స్పిల్ వే ద్వారా 2.16 లక్షల క్యూసెక్కులు వెళ్తుండగా, ఎడమ కాల్వకు 8193 క్యూసెక్కులు, విద్యుత్ కేంద్రానికి 33,291 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా, ప్రస్తుతం 587.30 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలకుగాను 305.68 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు 2,63,370 క్యూసెక్కుల వరద వస్తుండగా, 2,70,754 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
నాగార్జున సాగర్‌కు కొనసాగుతున్న వరద : 26 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్న అధికారులు
October 04, 2025
0
Tags