ఫిలిప్పీన్స్‌లో మరోసారి భారీ భూకంపం : 26 మంది మృతి

Telugu Lo Computer
0


ఫిలిప్పీన్స్ మరోసారి భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.9 తీవ్రతతో దేశంలోని అనేక ప్రాంతాలను అతలాకుతలం చేసింది. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఇప్పటి వరకు కనీసం 26 మంది మృతిచెందగా, పదుల సంఖ్యలో గాయపడ్డారు. శిథిలాల కింద ఇంకా చాలామంది చిక్కుకుపోయి ఉండొచ్చని అధికారులు తెలిపారు. అమెరికా జియోలాజికల్ సర్వే ప్రకారం, ఈ భూకంపం సెబు ప్రావిన్స్‌లోని బోగో నగరానికి 17 కిలోమీటర్ల దూరంలో చోటుచేసుకుంది. బోగోలోనే అత్యధిక ప్రాణనష్టం జరిగింది. అక్కడ కనీసం 14 మంది మృతిచెందగా, వందలాది కుటుంబాలు నిరాశ్రయులయ్యాయి. పర్వత ప్రాంతాలలో కొండచరియలు విరిగి పడి, గ్రామాలు బాహ్య ప్రపంచంతో పూర్తిగా వేరుపడ్డాయి. విద్యుత్, కమ్యూనికేషన్ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి.  రహదారులు బీటలు వారడంతో సహాయక చర్యలకు పెద్ద అడ్డంకులు ఎదురవుతున్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)