అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ దీపావళి స్పెషల్ సేల్ లో లావా బోల్డ్ ఎన్1 స్మార్ట్‌ఫోన్ పై ఆఫర్ ప్రకటించింది. ఈ ఫోన్ ధర రూ.6,999 మాత్రమే. అదనంగా, HDFC బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డ్ EMI ఆప్షన్ ద్వారా కొనుగోలు చేస్తే, రూ.699 ఎక్స్‌ట్రా డిస్కౌంట్ పొందవచ్చు. దీని ద్వారా ఫైనల్ ధర కేవలం రూ.6,300కి తగ్గిపోతుంది, ఇది తక్కువ బడ్జెట్‌లో అత్యధిక విలువను ఇస్తుంది. ఇందులో 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది, ప్రధాన కెమెరా 13MP, సెల్ఫీ కోసం 5MP ఫ్రంట్ కెమెరా అందుబాటులో ఉంటుంది. 5జీ చిప్ సెట్ ఉండటం వల్ల ఈ ఫోన్ నెట్‌వర్క్ వేగం, డౌన్లోడ్ స్పీడ్ పరంగా అత్యాధునికంగా ఉంటుంది.ఇందులో 4 జీబీ ఫిజికల్ ర్యామ్‌తో పాటు 4జీబీ వర్చువల్ ర్యామ్ కూడా ఉంది. దీనికి 64 జీబీ ఇంట్నర్నల్ స్టోరేజ్ కూడా ఉంది. ఈ లావా బడ్జెట్ 5జి స్మార్ట్ ఫోన్ HD+ రిజల్యూషన్ కలిగిన 6.75 ఇంచ్ స్క్రీన్ ఉంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్, మంచి బ్రైట్నెస్ కూడా ఉంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా దీనికి ఉంది. ఈ ఫోన్ IP54 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ స్ప్లాష్ రెసిస్టెన్స్ ఉండటం వల్ల బాగా పనిచేస్తుంది. ఈ లావా స్మార్ట్ ఫోన్ ఫేస్ అన్లాక్, సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ బ్లూ, గోల్డ్ రెండు కలర్‌లో ఈ మొబైల్ ఉంది.
లావా బోల్డ్ ఎన్1 స్మార్ట్‌ఫోన్ పై ఆఫర్ ప్రకటించిన అమెజాన్
October 13, 2025
0
Tags