హైదరాబాద్ లోని రాయదుర్గం నాలెడ్జ్ సిటీ భూముల వేలానికి ఊహించని స్పందన వచ్చింది. రాయదుర్గంలో ఎకరా భూమి ధర రూ.177 కోట్లు పలికింది. అత్యధిక ధరకు 7.6 ఎకరాల భూమిని ఓ రియల్ ఎస్టేట్ సంస్థ సొంతం చేసుకుంది. ఎకరా రూ.177 కోట్ల చొప్పున రూ. 1357 కోట్లుకు రియల్ ఎస్టేట్ సంస్థ వేలం పాట పాడింది. టీజీఐఐసీ నిర్వహించిన వేలంలో 7.67 ఎకరాల ల్యాండ్ పార్సిల్‌ను ఎంఎస్ఎన్ రియాల్టీ దక్కించుకుంది. ప్రారంభ ధర ఎకరాకు రూ.101 కోట్లు ఉండగా, ఎంఎస్ఎన్ రియాల్టీ ఏకంగా ఎకరా భూమిని రూ.177 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ లావాదేవీ మొత్తం విలువ సుమారు రూ.1356 కోట్లుగా ఉందని అధికారులు తెలిపారు.
రాయదుర్గం నాలెడ్జ్ సిటీలో ఎకరా రూ.177 కోట్లకు దక్కించుకున్న ఎంఎస్ఎన్ రియాల్టీ !
October 06, 2025
0
Tags