హైదరాబాద్‌లో సుమారు 10 కోట్ల విలువైన డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకన్నారు. ఎఫిడ్రిన్ అనే డ్రగ్స్‌ను పోలీసులు సీజ్ చేశారు. జీడిమెట్ల పరిధిలోని సుచిత్రాకు దగ్గరలో ఈ డ్రగ్స్ తయారీ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక అపార్ట్‌మెంట్ వేదికగా ఐదురుగు కలిసి డ్రగ్స్ తయారీ చేస్తున్న సమాచారం అందుకున్న పోలీసులు, ఈ మేరకు సోదాలు నిర్వహించారు. దాంతో భారీగా డ్రగ్స్‌ను కనుగొన్నారు. ఈ ఘటనకు సంబంధించి నలుగుర్ని అరెస్ట్ చేయగా, ఒకరు పరారయ్యారు. ఈ డ్రగ్స్ విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ. 10 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
హైదరాబాద్‌లో రూ. 10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత !
October 09, 2025
0
Tags