ఐక్యూ, వివోలో ఫన్‌టచ్‌ OS స్థానంలో Origin OS 6

Telugu Lo Computer
0


ఐక్యూ స్మార్ట్‌ఫోన్లు ఇకపై ఆండ్రాయిడ్‌ 16 ఆధారంగా రూపొందిన Origin OS 6తో రానున్నాయని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ప్రస్తుతం ఐక్యూ ఫోన్లు ఆండ్రాయిడ్‌ 15 ఆధారిత ఫన్‌టచ్‌ ఓఎస్‌ 15తో పనిచేస్తున్నాయి. ఈ Origin OS 6ను భారత్‌లో త్వరలో ప్రవేశపెట్టనున్నట్లు ఐక్యూ ఇండియా సీఈవో నిపుణ్ మార్యా ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. దీంతో చైనాలో మాదిరిగానే భారత్‌లోనూ వివో, ఐక్యూ ఫోన్లు ఒకే తరహా యూజర్ ఇంటర్‌ఫేస్‌తో నడవనున్నాయి. తాజాగా ఫన్‌టచ్‌ ఓఎస్ ఇండియా అధికారిక ఎక్స్ ఖాతా పేరును OriginOSగా మార్చింది. తొలుత ప్రీమియం మోడల్స్‌కు, ఆపై మిడ్‌రేంజ్‌, బడ్జెట్ ఫోన్లకు అప్‌డేట్ రానున్నట్లు సమాచారం. Origin OS 6ను చైనాలో అక్టోబర్ 10న అధికారికంగా ఆవిష్కరించనున్నట్లు వివో ఇప్పటికే ప్రకటించింది. రాబోయే ఫ్లాగ్‌షిప్ ఫోన్లు వివో ఎక్స్‌300, ఎక్స్300 ప్రో ఆండ్రాయిడ్ 16 ఆధారిత Origin OS 6 తోనే మార్కెట్లోకి రానున్నాయి. వినియోగదారుల అనుభవాన్ని మెరుగుపరచడమే ఈ మార్పుల ప్రధాన ఉద్దేశమని కంపెనీ తెలిపింది. కొత్త ఓఎస్‌తో మరింత సులభమైన యూజర్ ఇంటర్‌ఫేస్‌, అధునాతన ఫీచర్లు లభించనున్నాయని పేర్కొంది.

Post a Comment

0Comments

Post a Comment (0)