అతి పెద్ద జానపద నృత్యంగా గిన్నిస్‌లో రికార్డుల్లోకి ఎక్కిన మన బతుకమ్మ కార్నివాల్‌ !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని సరూర్‌నగర్‌ స్టేడియంలో మన బతుకమ్మ కార్నివాల్‌ పేరుతో ఈరోజు నిర్వహించిన బతుకమ్మ కార్యక్రమం గిన్నిస్‌లో చోటు దక్కించుకుంది. 64 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసిన ఈ బతుకమ్మ చుట్టూలయ బద్ధంగా ఆడిన నృత్యం గిన్నిస్‌ రికార్డుల్లోకి ఎక్కింది. బతుకమ్మ పాటలతో సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియం మార్మోగింది. బంతి, చేమంతి, గునుగు, గులాబీ, తంగేడు, గడ్డిపువ్వు వంటి తీరొక్క పూలతో తయారు చేసిన బతుకమ్మలు దర్శనమిచ్చాయి. ఒకే వేదికపై సుమారు పదివేల మంది మహిళలు బతుకమ్మ ఆడిపాడి కనువిందు చేశారు. ఈ వేడుక అతిపెద్ద జానపద నృత్యంగా గిన్నిస్‌లో రికార్డుల్లోకి ఎక్కడం విశేషం. నవరాత్రి వేడుకల్లో భాగంగా తెలంగాణ పర్యాటక, సాంస్కృతిక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం సరూర్‌నగర్‌ వేదికగా ఈ గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డు ఈవెంట్‌'కు భారీ ఏర్పాట్లు చేశారు. ఇండోర్‌ సహా అవుట్‌ డోర్‌ స్టేడియాల్లో 64 అడుగుల ఎత్తు బతుకమ్మను ఏర్పాటు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)