ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి నుండి దిమ్మిడిజోల గ్రామానికి వెళ్తున్న పల్లె వెలుగు బస్సులో సీటు కోసం మహిళ, యువకుడి మధ్య గొడవ జరిగింది. ముందు నేను వచ్చానంటే, కాదు సీటులో నేను రుమాలు వేశానంటూ ఇద్దరు వాగ్వాదంకు దిగారు. అంతే కాకుండా జుట్లు పట్టుకొని మహిళ, యువకుడు కొట్టుకున్నారు. ఏ ఒక్కరు కూడా వెనక్కు తగ్గకుండా అందరి ముందే పిడిగుద్దులు కురిపించుకుంటున్నారు. ఆ యువకుడు సైతం మహిళను ఇష్టమున్నట్లు కడుపులో కొడుతూ నీచంగా ప్రవర్తించాడు. వీరి గొడవలను కొంత మంది రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్లు మండిపడుతున్నారు. సీటు కోసం మరీ ఆ గొడవలేంటని కూడా సీరియస్ అవుతున్నారు. ఇలాంటి గొడవలు లేకుండా పురుషులకు ప్రత్యేకంగా బస్సుల్ని నడిపించాలని మరికొంత మంది డిమాండ్ చేస్తున్నారు. మరికొంత మంది బస్సులో పోలీస్ కానిస్టేబుల్ ను పెట్టాలని కూడా కొరుతున్నారు.
సీటు కోసం కొట్టుకున్నమహిళ, యువకుడు : వీడియో వైరల్
September 12, 2025
0
Tags