మూడు సిమ్ కార్డ్స్ కి జియో సింగల్ రీఛార్జ్ ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ !

Telugu Lo Computer
0


జియో తొమ్మిదవ యానివెర్సరీ సెలబ్రేషన్ లో భాగంగా అందిస్తున్న రూ.449 ఫ్యామిలీ పోస్ట్ పెయిడ్ ప్లాన్‌ను ఎంచుకోవడం ద్వారా కేవలం నెలకు రూ.449తో కుటుంబంలోని మూడు నెంబర్లను యాక్టివేషన్‌లో ఉంచుకోవచ్చు. ఈ ప్లాన్ పూర్తి నెల రోజుల సైకిల్‌తో వస్తుంది. ఈ ప్లాన్‌లో నెల రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ సౌకర్యం లభిస్తుంది. అలాగే, ఇందులో మొత్తం 75 జీబీ డేటా లభిస్తుంది. ఈ డేటా అయిపోయిన తర్వాత ప్రతి జీబీకి రూ.10 చొప్పున ఛార్జ్ చేస్తారు. ఈ ప్లాన్‌తో అదనంగా యాడ్ చేసే ప్రతి ఫ్యామిలీ మెంబర్‌కు 5 జీబీ అదనపు డేటా లభిస్తుంది. రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి. ఈ ప్లాన్‌లో చేరే ప్రతి అదనపు ఫ్యామిలీ మెంబర్ సిమ్‌కు నెలకు రూ.150 అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ప్లాన్ తీసుకున్న వారికి జియో తన 9వ వార్షికోత్సవం సందర్భంగా కొన్ని అదనపు లాభాలను కూడా అందిస్తోంది. ఇందులో భాగంగా రెండు నెలల జియో హోమ్ సబ్‌స్క్రిప్షన్, మూడు నెలల జొమాటో గోల్డ్ సబ్‌స్క్రిప్షన్, మూడు నెలల జియో సినిమా సబ్‌స్క్రిప్షన్ తోపాటు ఒక నెల జియోసావన్ ప్రో సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అలాగే AJIO నుంచి రూ.1,000 షాపింగ్‌పై రూ.200 తగ్గింపు, అలాగే 50 జీబీ ఉచిత జియో ఏఐ క్లౌడ్ స్టోరేజ్ కూడా అందిస్తుంది. ఈ ప్లాన్ తీసుకున్న ఎలిజిబుల్ యూజర్లకు అన్‌లిమిటెడ్ 5జీ డేటా కూడా లభిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)