అమెరికాలో ఈత కొలనులో పడి మార్టూరు యువకుడు మృతి

Telugu Lo Computer
0


అమెరికాలోని బోస్టన్ లో ఎనిమిది నెలలుగా ఉద్యోగం చేస్తున్న మార్టూరుకు చెందిన యువకుడు పాటిబండ్ల లోకేష్‌ ఈతకొలనులో పడి మృతి చెందాడు. బాపట్ల జిల్లా మార్టూరు గ్రామానికి చెందిన గ్రానైట్ వ్యాపారి పాటిబండ్ల వేణుబాబు, శాంతి దంపతుల కుమారుడు పాటిబండ్ల లోకేశ్ గత మూడు సంవత్సరాలుగా అమెరికాలో బోస్టన్ సిటీలో ఉంటున్నట్లు బంధువులు వెల్లడించారు. ఎంఎస్ రెండు సంవత్సరాల చదువు పూర్తి చేసిన తర్వాత కొద్ది నెలలు ఖాళీగా ఉండి, గత ఎనిమిది నెలల క్రితం ఉద్యోగం సాధించాడు. ఇంతలోనే ప్రాణాలు కోల్పోయి ఆ కుటుంబంలో తీరని శోకాన్ని నింపాడు.. ఈ నెల 3వ తేదీన స్నేహితులతో కలిసి బోస్టన్ లోని ఈతకొలను దగ్గరకు వెళ్లి ఈత కొడుతూ కొలనులో పడి మృతి చెందాడు. గురువారం రాత్రి మార్టూరులోని కుటుంబ సభ్యులకుఅతడి స్నేహితులు  సమాచారం అందించారు. మృతదేహాన్ని మార్టూరు తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతున్నట్టు బంధువులు వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)