టాటా నెక్సాన్ కారు ఆగస్టు నెలలో భారీ సంఖ్యలో అమ్ముడైంది. మొత్తం 14,004 యూనిట్లు విక్రయించారు. 2024లో ఇదే కాలంలో 12,289 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ గణాంకాలను విశ్లేషిస్తే, అమ్మకాల శాతం సంవత్సరానికి 14% పెరిగింది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీ రూ. 8 లక్షల నుంచి రూ. 15.60 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది. కార్ల కొనుగోలుపై జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం సవరించింది. ఈ ప్రయోజనాన్ని పూర్తిగా కస్టమర్లకు బదిలీ చేయాలని టాటా మోటార్స్ నిర్ణయించింది. కాబట్టి, 'నెక్సాన్' ధర రూ. 1.55 లక్షల వరకు తగ్గింది. కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమలులోకి వస్తాయి. ఇది స్మార్ట్, ప్యూర్ ప్లస్, ప్యూర్ ప్లస్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్ మరియు ఫియర్‌లెస్ వంటి వేరియంట్లలో లభిస్తుంది. చూడటానికి చాలా మంచి డిజైన్‌ను కలిగి ఉంది. ప్యూర్ గ్రే, డేటోనా గ్రే, ప్రిస్టిన్ వైట్, కార్బన్ బ్లాక్, గ్రాస్‌ల్యాండ్ బీజ్, రాయల్ బ్లూ మరియు ఓషన్ బ్లూ రంగులలో కూడా ఇది అందుబాటులో ఉంది. కొత్త 'నెక్సాన్' శక్తివంతమైన పవర్‌ట్రైన్‌ను కలిగి ఉంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ మరియు 1.2-లీటర్ సిఎన్‌జి ఇంజిన్‌లతో వస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్/ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డీసీటీ (డ్యుయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. ఇది 17 నుంచి 24 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. 44 లీటర్ సామర్థ్యం గల ఫ్యూయల్ ట్యాంక్‌ను ఇది కలిగి ఉంది. ఈ ఎస్‌యూవీలో 5 సీటింగ్ ఆప్షన్ ఉంది. ప్రయాణానికి వెళ్ళేటప్పుడు ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళడానికి వీలుగా 382 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లు ఇందులో ఉన్నాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు మరియు 360-డిగ్రీ కెమెరాను ఇది కలిగి ఉంది. టాటా నెక్సాన్ ఈవీ కనీస ధర రూ. 12.49 లక్షలు, గరిష్ట ధర రూ. 17.19 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంది. ఇది 30 కిలోవాట్, 45 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్‌లను కలిగి ఉంది. పూర్తి ఛార్జ్‌పై 489 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఈ కారు మంచి డిజైన్‌ను కలిగి ఉంది. ఎంపోవర్డ్ ఆక్సైడ్, ప్రిస్టిన్ వైట్, ఫ్లేమ్ రెడ్, డేటోనా గ్రే, ఫియర్‌లెస్ పర్పుల్, ఇంటెన్సి టీల్, క్రియేటివ్ ఓషన్ మరియు కార్బన్ బ్లాక్ రంగులలో కూడా ఇది లభిస్తుంది. 5 సీటింగ్ ఆప్షన్ ఉంది. ప్రయాణికులు హాయిగా ప్రయాణించవచ్చు. ఎక్కువ లగేజ్ తీసుకెళ్ళడానికి 350 లీటర్ల బూట్ స్పేస్‌ను ఇది కలిగి ఉంది. కొత్త నెక్సాన్ ఈవీలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఆటో ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ మరియు సన్‌రూఫ్‌తో సహా వివిధ ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్) మరియు 360 డిగ్రీల కెమెరాను కలిగి ఉంది.
ఆగస్టు నెలలో భారీ సంఖ్యలో అమ్ముడైన టాటా నెక్సాన్
September 21, 2025
0
Tags