ప్రపంచంలోనే అతిపెద్ద దేవాలయ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మాణాన్ని అహ్మదాబాద్ లోని ఉమియా ధామ్ వద్ద అదానీ సిమెంట్, పీఎస్‌పీ ఇన్‌ఫ్రా సంస్థలు విజయవంతంగా నిర్మాణం పూర్తి చేశాయి. ఈ నిర్మాణం కోసం ప్రత్యేకంగా ఎకో మాక్స్ లో-కార్బన్ కాంక్రీట్ ను వినియోగించారు. లేటెస్ట్ ఇంజనీరింగ్ టెక్నాలజీని వినియోగించి ఈ రాఫ్ట్ ను నిర్మించారు. ఇది ఒక చారిత్రక ఇంజనీరింగ్ ఘనతగా అదానీ పేర్కొంది. ఇది లాజిస్టికల్ స్కేల్, సాంకేతిక కచ్చితత్వం, నూతన ఆవిష్కరణలను చేయడంలో అదానీ సిమెంట్ సామర్థ్యాన్ని చాటి బెబుతోందని తెలిపింది. ఈ భారీ ప్రాజెక్టును 54 గంటలపాటు నిరంతరాయంగా పని చేసి పూర్తి చేశారు. ఇందుకోసం అదానీ సిమెంట్ అభివృద్ధి చేసిన ప్రత్యేకమైన, స్థిరమైన ఎకో మాక్స్ M45 గ్రేడ్ లో-కార్బన్ కాంక్రీట్ 24,100 క్యూబిక్ మీటర్లు (M3) ఉపయోగించారు. ఈ ప్రక్రియలో 26 వ్యూహాత్మకంగా ఉన్న రెడీ-మిక్స్ కాంక్రీట్ ప్లాంట్లు, 285+ ట్రాన్సిట్ మిక్సర్ లు, 3,600 టన్నుల అధిక-పనితీరు గల సిమెంట్, 600 మందికి పైగా నైపుణ్యం కలిగిన కార్మికులు, సాంకేతిక నిపుణులు మూడు రోజుల పాటు షిఫ్టులలో పనిచేశారు. అదానీ గ్రూప్ సిమెంట్ బిజినెస్ సీఈఓ వినోద్ బహెటీ మాట్లాడుతూ "ఉమియా ధామ్ 60 ఎకరాల్లో విస్తరించింది. సుమారు రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఒక ప్రతిష్టాత్మక ఆధ్యాత్మిక కేంద్రంగా మారనుంది. ఈ ప్రాజెక్ట్ కేవలం ప్రపంచ రికార్డులను సృష్టించడం మాత్రమే కాకుండా అదానీ సిమెంట్ సంస్థ స్థాయి, వేగం, ఉద్దేశ్యాన్ని కూడా ప్రతిబింబిస్తుంది." అని పేర్కొన్నారు. ఇవి కేవలం ఇంజనీరింగ్ అద్భుతాలు కాదు. భక్తికి, ఆధునిక మౌలిక సదుపాయాలకు మధ్య సారధిగా ఉంటాయి. ఉమియా ధామ్ లో విజయవంతమైన రాఫ్ట్ కాస్టింగ్ దీనికి సజీవ నిదర్శనం అని తెలిపారు. విశ్వ ఉమియా ఫౌండేషన్ అధ్యక్షుడు ఆర్.పి. పటేల్ మాట్లాడుతూ జగజ్జనని మాతా పార్వతి ఆలయానికి సంబంధించిన ఈ ప్రపంచ రికార్డు ఫౌండేషన్ భారత సాంస్కృతిక, ఇంజనీరింగ్ వారసత్వానికి గర్వకారణం అని అన్నారు. భవిష్యత్తులో నిర్మించబోయే ప్రపంచంలోనే అతి ఎత్తైన ఆలయానికి 450 అడుగుల పొడవు, 400 అడుగుల వెడల్పు, 8 అడుగుల లోతు గల ఈ రాఫ్ట్ ఫౌండేషన్, 504 అడుగుల ఎత్తైన జగత్ జనని మా ఉమియా ఆలయానికి 1,551 ధర్మ స్తంభాలు ఉంటాయి. ఈ ఆలయం జస్పూర్ లో ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంటుంది. ఎకో మాక్స్ M45 కాంక్రీట్ మిక్స్ లో 66 శాతం సప్లిమెంటరీ సిమెంటీషియస్ మెటీరియల్ ఉంటుంది. ఇది కార్బన్ ఉద్గారాలను 60 శాతం తగ్గిస్తుంది. యాజమాన్య కూల్ క్రీట్ ఫార్ములేషన్ 28 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతను నిర్వహించి, థర్మల్ స్ట్రెస్ ను తగ్గించింది. నిర్మాణంలో అమర్చిన థర్మోకపుల్స్ నిజ సమయంలో ఉష్ణోగ్రత, మన్నికను పర్యవేక్షిస్తాయి. సైట్‌లో 1,000 మందికి పైగా పాల్గొన్నారు. ఆన్ లైన్‌లో 10,000 మందికి పైగా వీక్షించిన ఈ అద్భుత ఘనత, భారత్ ఇంజనీరింగ్, ఆధ్యాత్మిక మైలు రాళ్లను రూపొందించడంలో అదానీ సిమెంట్ పాత్రను వివరిస్తుంది. వరల్డ్ వన్ టవర్ నుంచి జమ్మూ కాశ్మీర్ లోని చెనాబ్ రైల్వే బ్రిడ్జ్ లాంటి ప్రసిద్ధ ప్రాజెక్టుల వరకు అదానీ సిమెంట్ నైపుణ్యాన్ని విస్తరిస్తుంది. ఈ విజయం అదానీ సిమెంట్ సాంకేతిక నైపుణ్యాన్ని మాత్రమే కాకుండా, స్థిరమైన అభివృద్ధికి, సాంస్కృతిక వారసత్వానికి చిహ్నంగా ఉంది.
ప్రపంచంలోనే అతిపెద్ద టెంపుల్ రాఫ్ట్ నిర్మించిన అదానీ సంస్థలు !
September 18, 2025
0
Tags