పారా ఆర్చరీలో చరిత్ర శీతల్‌దేవి స్వర్ణం : వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ను కైవసం చేసుకున్న తోమన్‌ కుమార్‌

Telugu Lo Computer
0


క్షిణ కొరియాలో జరుగుతున్న పారా ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌ షిప్‌లో కౌంపౌండ్‌ వ్యక్తిగత విభాగంలో 18 ఏళ్ల శీతల్‌ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించింది. ఫైనల్‌లో తుర్కియేకు చెందిన వరల్డ్‌ నెం.1 ఓజ్నూర్ క్యూర్ గిర్డిపై 146-143 తేడాతో విజయం సాధించి, స్వర్ణాన్ని సొంతం చేసుకుంది. అలాగే పురుషుల విభాగంలో తోమన్‌ కుమార్‌ విజేతగా నిలిచాడు. అంతకు ముందు శీతల్, తోమన్ కుమార్‌తో కలిసి కాంపౌండ్ ఈవెంట్ లో మిక్స్‌డ్ టీమ్ విభాగంలో కాంస్య పతకం గెలుచుకుంది. గ్రేట్ బ్రిటన్‌కు చెందిన జోడీ గ్రిన్‌హామ్, నాథన్ మాక్‌క్వీన్‌లను 152- 149 తేడాతో ఓడించారు. కాంపౌండ్ మహిళల ఓపెన్ టీమ్ ఈవెంట్‌లో, ఫైనల్‌లో తుర్కియే చేతిలో ఓడిపోయి శీతల్, సరిత రజతంతో సరిపెట్టుకున్నారు. రాకేశ్‌ కుమార్ కాంపౌండ్‌ మెన్స్‌ విభాగం ఫైనల్‌లో 40-20 తేడాతో ఓడిపోయాడు. సాంకేతిక కారణాలతో అతడు వైదొలగాల్సి రావడంతో తోమన్ కాంపౌండ్ పురుషుల టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. పారిస్‌ పారా ఒలింపిక్స్‌లో కాంస్య పతక విజేత రాకేశ్‌ నాలుగు షాట్స్‌ అనంతరం తన విల్లులో సమస్యతో పోటీ నుంచి వైదొలిగాడు. దీంతో తోమన్‌ నాలుగు సార్లు సరిగ్గా లక్ష్యాన్ని ఛేదించి ఈ విభాగంలో వరల్డ్‌ ఛాంపియన్‌ షిప్‌ను కైవసం చేసుకున్నాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)