ఆంధ్రప్రదేశ్ లోని తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం పుల్లలపాడులో 16వ నంబరు హైవేపై విజయవాడ దుర్గమ్మ దర్శనానికి కాలినడకన వెళ్తున్న భవానీ భక్తులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఘటనాస్థలంలోనే భవానీ భక్తులు పకృతి శివ (35), పకృతి శ్రీను (22) మృతి చెందారు. మృతులు అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం దోసలపాడు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.
భవానీ భక్తులపైకి దూసుకెళ్లిన కారు : ఇద్దరి మృతి, మరొకరి పరిస్థితి విషమం
September 28, 2025
0
Tags