బయోమెట్రిక్ టెక్నాలజీలో 'స్మార్ట్ బ్రా'ను సృష్టించిన జపనీస్ విద్యార్థి !

Telugu Lo Computer
0


యోమెట్రిక్ టెక్నాలజీలో జపనీస్ విద్యార్థి  'స్మార్ట్ బ్రా'ను తీసుకొచ్చాడు. ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ప్రత్యేకమైన లోదుస్తులు సాధారణ హుక్‌కు బదులుగా వేలిముద్రల గుర్తింపుతో పనిచేస్తాయి. ఎక్స్ వేదికగా విడుదలైన ఈ వీడియో నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేయడమే కాకుండా సాంకేతిక భవిష్యత్తు గురించి చర్చలకు దారి తీసింది. ZAWAWORKS అనే పేరుతో ఉన్న ఈ యువ ఆవిష్కర్త తన ప్రాజెక్ట్‌ను జూలై 19, 2024న ప్రపంచానికి పరిచయం చేశాడు. ఈ జపనీస్ విద్యార్థి ఈ బ్రాను "మోసాన్ని నిరోధించడానికి" రూపొందించిన ఒక సరదా కాన్సెప్ట్‌గా అభివర్ణించాడు. ఈ బ్రాను ధరించినప్పుడు, దాన్ని తెరవాలంటే కేవలం ఒకే ఒక్క వేలిముద్ర అవసరం - అది భాగస్వామిది మాత్రమే. బ్రాను అన్‌లాక్ చేయడానికి పాస్‌వర్డ్ లేదా సంప్రదాయ కొక్కెం వంటివి ఉండవు. ఈ ఆవిష్కరణను తెలియజేస్తూ సృష్టికర్త తన పోస్ట్‌లో "ఇకపై మీ బాయ్‌ఫ్రెండ్ మాత్రమే మీ బ్రాను తెరవగలడు!" అని చమత్కరించాడు. ఇది తక్కువ సమయంలోనే వైరల్ అయి, లక్షల మంది దృష్టిని ఆకర్షించింది. ఈ వీడియో కేవలం వినోదం కోసమే కాకుండా బయోమెట్రిక్ టెక్నాలజీ భవిష్యత్తును కూడా సూచిస్తోంది. నిపుణుల ప్రకారం వేలిముద్రలు, కంటి రెటీనా లేదా ముఖ గుర్తింపు వంటి బయోమెట్రిక్ టెక్నాలజీలు ఇప్పుడు దుస్తులు, ఇతర వ్యక్తిగత వస్తువులలోకి విస్తరించవచ్చు. ఉదాహరణకు, మీరు మాత్రమే తెరవగల జాకెట్, లేదా మీ వస్తువులను ఇతరులు తీసుకోకుండా నిరోధించే స్మార్ట్ బ్యాగులు వంటివి భవిష్యత్తులో మనం చూడవచ్చు. బయోమెట్రిక్ టెక్నాలజీ ఉత్పత్తి ఖర్చులు తగ్గుతున్నందున సాధారణ వినియోగ వస్తువులలో ఈ టెక్నాలజీని వాడటం అసంభం కాదు. ఈ స్మార్ట్ బ్రా ఇంకా వాణిజ్యపరంగా అందుబాటులోకి రాకపోయినా మన రోజువారీ లైఫ్ ఎంత "స్మార్ట్"గా మారగలదనే దానిపై ఇది ఒక చర్చకు తెరలేపింది. ఫోన్లను వ్యక్తిగత టెక్నాలజీకి అత్యున్నత శిఖరంగా భావించినా, ఇలాంటి వినూత్న ఆవిష్కరణలు భవిష్యత్తులో మన దైనందిన జీవితాన్ని పూర్తిగా మార్చివేసే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)