బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఇటీవల భేటీ కావడంపై ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ కేటీఆర్‌ను కలుస్తానని, ఆయన్ను ఎందుకు కలవకూడదని ప్రశ్నించారు. గతంలోనూ వివిధ సందర్భాల్లో కేటీఆర్‌ను కలిశానని గుర్తు చేశారు. కేటీఆర్‌ను కలవాలంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని అడగాలా అని అన్నారు. తెలంగాణపై టీడీపీ ఫోకస్ చేస్తుందని ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. జూబ్లీహిల్స్‌లో టీడీపీ పోటీపై పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుదే తుది నిర్ణయమని పేర్కొన్నారు. కవితను టీడీపీలోకి తీసుకోవడమంటే జగన్‌ను చేర్చుకున్నట్లేనని వ్యాఖ్యానించారు. ఎన్డీయే ఉప రాష్ట్రపతి అభ్యర్థికి ఎందుకు ఓటు వేశారో జగన్‌ను వైసీపీ ఎంపీలు అడగాలని నారా లోకేశ్ సూచించారు. ఇప్పుడే కాదు, 2029 ఎన్నికల్లోనూ మోడీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు. రెడ్‌బుక్‌లో చాలా స్కామ్‌లు ఉన్నాయని నారా లోకేశ్ అన్నారు. అవన్నీ బయటకు వస్తాయని తెలిపారు. ఆ భయంతోనే జగన్ బెంగళూరులో ఉంటున్నారని విమర్శించారు. ఏపీ లిక్కర్ కేసులో ప్రభుత్వ జోక్యం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ కేసు విచారణ పారదర్శకంగా కొనసాగుతోందని తెలిపారు. ఫైబర్ నెట్‌ను టాటా సంస్థకు ఇచ్చే చర్చ జరగలేదని స్పష్టం చేశారు.
కవితను టీడీపీలోకి తీసుకోవడమంటే జగన్‌ను చేర్చుకున్నట్లే : మంత్రి నారా లోకేశ్
September 10, 2025
0
Tags