ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తొలిసారి తమ జట్టుకు ఓ విదేశీయుడిని హెడ్ కోచ్‌గా నియమించింది. 2025-26 సీజన్‌కు పురుషుల సీనియర్ జట్టు హెడ్ కోచ్‌గా న్యూజిలాండ్‌కు చెందిన గ్యారీ స్టెడ్ ఎంపిక చేయబడ్డాడు. స్టెడ్ 2021లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిన న్యూజిలాండ్‌కు హెడ్ కోచ్‌గా పని చేశాడు. ఆ ఎడిషన్ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించింది. 53 ఏళ్ల స్టెడ్ తన కోచింగ్ ప్రయాణంలో న్యూజిలాండ్‌ను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో పాటు 2019 వన్డే వరల్డ్‌కప్, 2021 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్‌కు చేర్చాడు. స్టెడ్ ఆథ్వర్యంలో న్యూజిలాండ్ గతేడాది భారత్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. 268 అంతర్జాతీయ మ్యాచ్‌లకు కోచ్‌గా వ్యవహరించిన స్టెడ్ ఆంధ్ర క్రికెట్‌ను ఏమేరకు ముందుకు తీసుకెళ్తాడో చూడాలి. ఏసీఏలో భాగం కావడంపై స్టెడ్ స్పందిస్తూ ఇక్కడి క్రికెట్ పట్ల ఉన్న అభిమానం అద్భుతంగా ఉంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అభివృద్ధి పట్ల చూపుతున్న నిబద్ధత నాకు ఎంతో ప్రేరణనిచ్చింది. ఆటగాళ్లతో కలిసి పని చేయడం కోసం ఎదురు చూస్తున్నానని అన్నాడు.
ఆంధ్ర క్రికెట్ జట్టుకు హెడ్ కోచ్‌గా గ్యారీ స్టెడ్ ఎంపిక !
September 14, 2025
0
Tags