ఏసీబీ విజయవాడ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌లో నమోదైన కేసులను గంపగుత్తగా కొట్టివేయడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని  వ్యక్తం చేసింది. విజయవాడ సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌కు పోలీస్‌ స్టేషన్‌ హోదా లేదని ఇటీవల కేసులను హైకోర్టు క్వాష్‌ చేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పుపై జస్టిస్ ఎంఎం సుందరేష్ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇంత దారుణంగా కూడా చట్టాలను అన్వయించుకుంటారా? అని ప్రశ్నించింది. ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు? దర్యాప్తు ఏం జరుగుతుందో కూడా చూడకుండా కేసులు కొట్టివేయడమేంటి. ఏసీబీ నమోదు చేసిన అక్రమాస్తుల కేసులను ఇలా ఏకపక్షంగా కొట్టివేస్తారా? అంటూ ప్రతివాదులకు ధర్మాసనం నోటీసులు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులు ఏ ఒక్క ఇతర కేసుకు అమలు కావని స్పష్టం చేసింది. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్న 11 ఎఫ్‌ఐఆర్‌లపై తదుపరి విచారణ కొనసాగించి, ఛార్జిషీట్‌లు దాఖలు చేసేందుకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్‌ కేంద్రంగా సెంట్రల్‌ ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ పని చేసిందని, ఈ యూనిట్‌కు రాష్ట్ర మంతా జ్యూరిడిక్షన్‌ కలిగి ఉందని రాష్ట్ర ప్రభుత్వ సీనియర్‌ న్యాయవాదులు సిద్దార్థ లూథ్రా, గుంటూరు ప్రమోద్‌లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రాష్ట్ర విభజన తర్వాత... అదే యూనిట్‌ విజయవాడ కేంద్రంగా కార్యకలాపాలు సాగించినట్లు వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న చట్టాలు, నోటిఫికేషన్లు తర్వాత కూడా అమల్లోనే ఉంటాయని విభజన చట్టంలో స్పష్టంగా పొందుపరిచారని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇదే విషయాన్ని స్పష్టం చేస్తూ గతంలో పంజాబ్‌, బీహార్‌ రాష్ట్రాల విభజన కేసుల్లో సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చిందని ప్రభుత్వ న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు. విజయవాడలో యూనిట్‌ ఏర్పాటు చేసి తదుపరి కార్యకలాపాలు సాగించేందుకు ప్రత్యేకంగా నోటిఫై చేయాల్సిన అవసరం లేదని వివరించారు. హైదరాబాద్‌లో ఉన్న ఇన్వెస్టిగేటివ్‌ యూనిట్‌ విజయవాడకు తరలించాక పోలీస్‌ స్టేషన్‌ హోదా గురించి ప్రత్యేకంగా నోటిఫికేషన్‌ అవసరం లేదన్న విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఉన్న అధికారాలే.. విజయవాడకు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతాయన్న విషయాన్ని, సుప్రీంకోర్టు తీర్పులను పట్టించుకోకుండా హైకోర్టు ఏకపక్షంగా తీర్పు ఇచ్చిందని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆరు వారాలు వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)