తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోకాపేట్లో కూరగాయల కత్తితో భర్తను భార్య హత్య చేసింది. పోలీసులు కేసు నమోదుచేసి భార్యను అదుపులోకి తీసుకున్నారు. అస్సాంకు చెందిన కృష్ణజ్యోతి బోరా, భరత్ బోరా హైదరాబాద్ శివారులోని కోకాపేట్ లో కార్మికులుగా పని చేస్తూ నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా భార్య కృష్ణ జ్యోతిని భర్త భరత్ బోరా మద్యం సేవించి ఆమెను చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. ఈ క్రమంలో భార్యాభర్తల మధ్య తరచూ గొడవులు జరుగుతుండేవి. గురువారం రాత్రి చిన్న విషయానికి ఇద్దరి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ కాస్త పెద్దదిగా కావడంతో కృష్ణజ్యోతి ఆగ్రహంతో విచక్షణారహితంగా కూరగాయల కత్తితో భర్తపై దాడి చేసింది. కత్తితో భర్తను పలుసార్లు పొడవడంతో భరత్ బోరా కేకలు వేస్తూ కిందపడిపోయాడు. అతని అరుపులు విన్న స్థానికులు ఇంటిలోపలికి వచ్చి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్నాడు. స్థానికులు హుటాహుటిన అతన్ని చికిత్స నిమిత్తం ఆస్పత్రి తతరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భరత్ బోరా మృతి చెందాడు. భర్త వేధింపులు తాళలేకనే కత్తితో దాడిచేసినట్లు కృష్ణ జ్యోతి బోరా తెలిపింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.
వేధింపులు తాళలేక కూరగాయల కత్తితో భర్తను హత్య చేసిన భార్య !
September 19, 2025
0
Tags