నిర్మల్ లో వేలంలో గణేష్ లడ్డూ దక్కించుకున్న ముస్లిం మహిళ అమ్రిన్

Telugu Lo Computer
0


తెలంగాణలోని నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద శనివారం నిమజ్జనోత్సవం సందర్భంగా లడ్డును వేలం వేశారు. ఈ వేలంలో కాలనీకి చెందిన ముస్లిం మహిళ అమ్రిన్ 1,88,888 రూపాయలకు వేలంపాడి లడ్డూను దక్కించుకున్నారు. వేలంలో లడ్డూ తాను సొంతం చేసుకున్నందుకు తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. భారీ ధరకు వేలంలో ముస్లిం మహిళ లడ్డూను సొంతం చేసుకోవడంపై స్థానికులు ఆశ్చర్యంతో పాటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు ఫార్వర్డ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ డా.జి. జానకి షర్మిల ఐపీఎస్ హెచ్చరించారు. నిర్మల్ పట్టణంలో గణేష్ నిమజ్జనం సందర్భంగా, నిజామాబాద్ కు చెందిన నసీం బేగం అనే మహిళ బురఖా ధరించి హల్ చల్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. ఆ మహిళ పై నిర్మల్ పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఈ సంఘటనకు సంబంధించి తప్పుడు వార్తలు, వదంతులు ఎవరైనా సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)