అప్పు పెట్టిన చిచ్చు : భయంతో అప్పు ఇచ్చిన వ్యక్తి భార్య, కుమారుడి ఆత్మహత్య

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం ఫణిదం గ్రామానికి చెందిన శ్రీనివాసరావు అదే గ్రామానికి చెందిన దాసరి వెంకటేశ్వర్లకు ఆరు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు చెల్లించాలని కొన్ని రోజులుగా కోరుతున్నా వెంకటేశ్వర్లు ముఖం చాటేస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం వెంటేశ్వర్లు ఇంటి వద్దకు శ్రీనివాసరావు భార్య పూర్ణకుమారి, కుమారుడు వెంకటేశ్‌ వెళ్లి అప్పు చెల్లించాలని నిలదీశారు. అప్పు చెల్లించలేనంటూ వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగాడు. పూర్ణకుమారి ఇంటికి వచ్చి విషయాన్ని భర్త శ్రీనివాసరావుకు చెప్పారు. వెంకటేశ్వర్లు ప్రాణాలకు ముప్పు ఉంటుందేమోనన్న భయంతో శ్రీనివాసరావు కుటుంబం మానసిక ఒత్తిడికి గురైంది. గుంటూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వెంకటేశ్వర్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడని తెలుసుకుని శ్రీనివాసరావు పురుగుల మందు తాగాడు. ఈ పరిమాణాన్ని ఊహించని ఆయన భార్య పూర్ణకుమారి, కుమారుడు వెంకటేశ్‌ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. పూర్ణకుమారి మృతదేహం లభ్యం కాగా కుమారుడి మృతదేహం కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం శ్రీనివాసరావు, వెంకటేశ్వర్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. సత్తెనపల్లి గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)