ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గత నాలుగు రోజులుగా వైరల్ ఫీవర్‌తో పాటు దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బంది పడుతూ వైద్యం చేయించుకుంటున్నారు. హైదరాబాద్‌లో వైద్యం చేయించుకోవాల్సిందిగా వైద్యులు సూచించారు. దీంతో డాక్టర్ల సలహా మేరకు హైదరాబాద్‌లో వైద్య పరీక్షలు చేయించుకోనున్నారు. అయితే జ్వరంతో బాధపడుతున్నప్పటికీ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఆ రోజు రాత్రి నుంచే ఆయనకు జ్వరం తీవ్రత పెరిగింది. దీంతో విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పారు. అయినప్పటికీ రెండు రోజుల క్రితం శాఖాపరమైన అంశాలపై అధికారులతో డిప్యూటీ సీఎం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారని జనసేన పార్టీ కార్యాలయం పేర్కొంది.
వైరల్ ఫీవర్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్
September 26, 2025
0
Tags