ప్రపంచ ఛాంపియన్‌ గుకేశ్‌ను ఓడించిన అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ అభిమన్యు మిశ్రా

Telugu Lo Computer
0


ఫిడె గ్రాండ్‌ స్విస్‌ 2025లో భారత చెస్‌ స్టార్‌, ప్రపంచ ఛాంపియన్‌ గుకేశ్‌ను అమెరికా గ్రాండ్‌మాస్టర్‌ అభిమన్యు మిశ్రా ఓడించాడు. 16 ఏళ్ల వయసులోనే ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి చరిత్ర సృష్టించాడు. మిశ్రా 61 ఎత్తుగడలతో ఈ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. కానీ తన ప్రదర్శనతో అతడు సంతృప్తి చెందలేదు. 'నేను గెలిచినప్పటికీ, ఈ టోర్నమెంట్‌ మునుపటి గేమ్స్‌లా అంత ఆహ్లాదకరంగా అనిపించలేదు. కానీ టోర్నమెంట్‌ నేను ఊహించిన దానికంటే బాగా జరుగుతోంది. నేను ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే, టోర్నమెంట్‌ను కూడా గెలిచే అవకాశం ఉంది. నిన్న కూడా నేను ప్రాగ్‌పై కొన్ని తప్పులు చేశాను. కానీ నేను ఈ ఆటగాళ్ల కంటే (గుకేశ్‌, ప్రాగ్‌) తక్కువ అని నాకు ఎప్పుడూ అనిపించలేదు. నేను వారితో సమంగా ఉన్నా అని భావిస్తున్నా..' అని మిశ్రా తన విజయం అనంతరం అన్నాడు. అలాగే ఆర్‌.ప్రజ్ఞానందకు జర్మనీకి చెందిన మథియాస్‌ బ్లూబామ్‌ వల్ల షాక్‌ తగిలింది. అతడు 55 ఎత్తుల్లో ప్రజ్ఞానందపై విజయం సాధించాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)