స్లోవేనియాలో పర్యటిస్తున్న చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఆ దేశ ఉప ప్రధాని తాన్యా ఫజోన్‌తో సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'చైనా ఎప్పుడూ యుద్ధాలను ప్రోత్సహించదు, వాటిలో పాల్గొనదు. మేము విశ్వసించే మార్గం శాంతియుత చర్చలు, సంభాషణల ద్వారా సమస్యలను పరిష్కరించడం మాత్రమే' అని ఆయన అన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ సమాజం గందరగోళం, ఘర్షణలతో నిండి ఉందని, ఈ సమయంలో బహుళపాక్షిక విధానాలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. చైనా, యూరప్‌లు ప్రత్యర్థులుగా కాకుండా మిత్రులుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. అంతకుముందు, డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్' వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 'రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ముగిసే వరకు నాటో కూటమి చైనాపై 50 నుంచి 100 శాతం టారిఫ్‌లు విధించాలి. రష్యాపై చైనాకు బలమైన పట్టు ఉంది. ఈ భారీ సుంకాలు ఆ పట్టును విచ్ఛిన్నం చేస్తాయి. తద్వారా ఈ భయంకరమైన యుద్ధానికి ముగింపు పలకవచ్చు' అని ట్రంప్ పోస్ట్ చేశారు.గతంలో కూడా ట్రంప్ చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు. అమెరికాకు వ్యతిరేకంగా జిన్‌పింగ్ కుట్ర పన్నుతున్నారని విమర్శించారు. అయితే, ఆసక్తికరంగా, ఈ ఆరోపణలు చేసిన కొన్ని గంటలకే చైనా నాయకత్వంతో తన వ్యక్తిగత సంబంధాలు చాలా బాగున్నాయని చెప్పడం గమనార్హం.
చైనా ఎప్పుడూ యుద్ధాలను ప్రోత్సహించదు, వాటిలో పాల్గొనదు : చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ
September 14, 2025
0
Tags