సినిమా పైరసీ ముఠాను అరెస్టు చేసిన తెలంగాణ పోలీసులు

Telugu Lo Computer
0


తెలంగాణ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దేశంలోనే అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్నారు. ముఠాకు చెందిన ఆరుగురిని అరెస్టు చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసినట్లు గుర్తించారు. సినిమా ఇండస్ట్రీకి భారీగా నష్టం చేసినట్లు అంచనా వేస్తున్నారు. 'హ్యాష్‌ట్యాగ్‌ సింగిల్‌' సినిమా పైరసీపై గతంలో పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై విచారణ చేపట్టి జులై 3న వనస్థలిపురానికి చెందిన కిరణ్‌ను అరెస్టు చేశారు. అతడిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. పైరసీ ముఠా దుబాయ్‌, నెదర్లాండ్‌, మయన్మార్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఈటీవీ విన్‌ కంటెంట్‌ను పైరసీ చేసి అమ్ముకున్న మరో నిందితుడిని అరెస్టు చేశారు. రికార్డు చేసిన కంటెంట్‌ను ఇతర వెబ్‌సైట్లకు పైరసీ ముఠా విక్రయిస్తోంది. ఓటీటీ కంటెంట్లను ఐబొమ్మ సహా పలు ప్లాట్‌ఫామ్‌లకు అమ్ముతోంది. థియేటర్లలో ప్లే అయ్యే శాటిలైట్‌ కంటెంట్‌ ఐడీ, పాస్‌వర్డ్‌లను నేరగాళ్లు క్రాక్‌ చేస్తున్నారు. ఏజెంట్లకు రికార్డు కెమెరాలు అందజేసి రహస్యంగా రికార్డు చేయడాన్ని నేర్పిస్తున్నారు. అనంతరం వారికి టికెట్లు బుక్‌ చేసి థియేటర్లలోనూ రికార్డు చేయిస్తున్నారు. చొక్కా జేబు, పాప్‌కార్న్‌ డబ్బా, కోక్‌ టిన్‌లలో కెమెరాలు పెట్టి చిత్రీకరిస్తున్నారు. ఏజెంట్లకు క్రిప్టో కరెన్సీ రూపంలో నిందితులు కమీషన్లు ఇస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)