హిజ్రాలు దాడి చేశారన్న మనస్తాపంతొ ఆత్మహత్య చేసుకున్న మహిళ !

Telugu Lo Computer
0


విజయవాడలోని గిరిపురంలో హిజ్రాలు దాడి చేశారని మనస్తాపానికి గురై మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం గిరిపురానికి చెందిన గోపిచంద్‌ అనే యువకుడు అదే ప్రాంతానికి చెందిన మంజుల అనే యువతిని గత మూడేళ్లుగా ప్రేమిస్తున్నాడు. దీంతో ఈ నెల 11న యువతి తరఫున 20 మంది హిజ్రాలు యువకుడి ఇంటిపై దాడి చేశారు. యువకుడితోపాటు అతడి తండ్రి కుమార్‌బాబు, తల్లి కుమారి (40) పైనా విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో మనస్తాపానికి గురైన కుమారి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబీకులు ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజులుగా చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం ఆమె ప్రాణాలు కోల్పోయింది. దీంతో మహిళ బంధువులు మాచవరం పోలీస్‌స్టేషన్‌ ఎదుట ఆందోళనకు దిగారు. హిజ్రాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)