తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు : వాతావరణ శాఖ హెచ్చరిక

Telugu Lo Computer
0


బంగాళాఖాతంలో ఏర్పడన ఆవర్తనం కారణంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాతావరణ శాఖ ఏపీలోని పలు జిల్లాలతో పాటుగా హైదరాబాద్ నగరానికి భారీ వర్ష మప్పు ఉందని హెచ్చరించింది. ఏపీలోని పలు జిల్లాలలో పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది. వాతావరణ శాఖ తాజా హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. మరోసారి హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అటు ఏపీలో పలు జిల్లాలకు పిడుగుపాటు హెచ్చరిక జారీ అయింది. విజయ నగరం, మన్యం, అల్లూరి, విశాఖ జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా శ్రీకాకుళం, కోనసీమ, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. తిరుపతి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కరుస్తాయని, 40-50కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక, తెలంగాణలోని ఇక వికారాబాద్, సంగారెడ్డి, నారాయణపేట, మహబూబ్‌నగర్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో రాబోయే 2 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)