తెలంగాణలోని నారాయణపేట జిల్లా కేంద్రంలో శనివారం వినాయక నిమజ్జన ఉత్సవాల్లో నారాయణపేట పురపాలికలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న శేఖర్ (45) గుండెపోటుతో మృతి చెందాడు. నిమజ్జన ఉత్సవాల్లో డ్యాన్స్ చేస్తూ పడిపోయాడు. విషయాన్ని గమనించిన స్థానిక ఎస్సై వెంకటేశ్వర్లు సీపీఆర్ చేసి.. స్థానికుల సాయంతో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే శేఖర్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
గణేష్ నిమజ్జనంలో డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో వ్యక్తి మృతి
September 06, 2025
0
Tags