నిరసనలకు సిద్ధమైన ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు తమ పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి ఇప్పటికే రెండుసార్లు నోటీసులు ఇచ్చినా స్పందన రాకపోవడంతో నిరసనలకు సిద్ధమయ్యారు. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వానికి మరోసారి ఇవాళ రిమైండర్ నోటీసు ఇచ్చారు. అదే సమయంలో నిరసనల షెడ్యూల్ కూడా ప్రకటించారు. ఈ మేరకు రాష్ట్రంలో సచివాలయాల్లో సేవలకు అంతరాయం తప్పేలా లేదు. హక్కుల సాధన కోసం సెప్టెంబర్ 23నుండి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలు ప్రారంభిస్తున్నట్లు రాష్ట్ర సంచాలకులకు ముందస్తు నోటీసు అందించినట్లు ఐక్యవేదిక రాష్ట్ర ఛైర్మన్ ఎం.డి.జాని పాషా,సెక్రటరీ జనరల్ విప్పర్తి.నిఖిల్ కృష్ణ,రాష్ట్ర కన్వీనర్ అబ్దుల్ రజాక్ ప్రకటించారు. ప్రతినిధుల బృందం సెప్టెంబర్ 8వ తేదీన రాష్ట్ర కార్యాలయంలో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రధాన సమస్యల పరిష్కారం కోరుతూ ముందస్తు సమాచారం ఇస్తూ 15 రోజుల గడువుతో నోటీసు ఇచ్చినట్లు తెలిపారు. ఇవాళ్టితో 15 రోజుల గడువు ముగిసినప్పటికీ సచివాలయాల శాఖ నుండి కానీ రాష్ట్ర ప్రభుత్వం తరపున కానీ సమస్యల పరిష్కారం కోసం ఎటువంటి స్పందన లేనందున ఇవాళ ముందస్తు నోటీసులో పొందుపరిచిన సమాచారం ప్రకారం రేపటి నుంచి చేపట్టనున్న నిరసన కార్యక్రమాల కార్యాచరణ సమాచారం రాష్ట్ర సంచాలకులకు అందించినట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల న్యాయమైన సమస్యలకు పరిష్కారం లభించని పక్షంలో ఐక్యవేదిక తరపున విజయవాడ వేదికగా మరోసారి భేటీ అయి ఉద్యోగుల నియమ నిబంధనలకు కట్టుబడి ఆందోళనల్ని ఉధృతం చేస్తామన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)