టీజీఎస్ పీడీసీఎల్ లో ఏడీఈపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు

Telugu Lo Computer
0

హైదరాబాద్‌ టీజీఎస్ పీడీసీఎల్ లో ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్ అనే అధికారి ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ మేరకు అంబేద్కర్ పై అక్రమాస్తుల కేసు నమోదైంది. అతని ఆస్తులు చూసి అధికారులు ఆశ్చర్యపోయారు. శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్, గచ్చిబౌలిలో ఆరంతస్తుల బిల్డింగ్, 10 ఎకరాల్లో ఆమ్తర్ కెమికల్స్ పేరిట కంపెనీ, హైదరాబాద్ లో 6 రెసిడెన్షియల్ ప్లాట్స్, 1 ఫామ్ ల్యాండ్ అలాగే 2 ఫోర్ వీలర్లు, బంగారం, బ్యాంకు డిపాజిట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. బినామీ సతీష్‌ ఇంట్లో రూ. 2.18 కోట్లు స్వాధీనం చేసుకుంది. మొత్తం ఆస్తుల విలువ రూ.300 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఏసీబీ అధికారులు అంబేడ్కర్‌ ఇళ్లు, ఆయన బంధువులు, కుటుంబసభ్యుల ఇళ్లలో ముమ్మరంగా సోదాలు నిర్వహించింది. అయితే విద్యుత్‌ శాఖలో అవినీతి అధికారి వ్యవహారం బట్టబయలు కావడంతో చర్చనీయాంశమైంది. అంబేడ్కర్​ ఆస్తులపై సోదాలు ముగిసిన అనంతరం ఆయనను అరెస్టు చేసింది. కోర్టులో ప్రవేశపెట్టగా 14 రోజుల రిమాండ్ విధించింది. ఏడీఈగా పనిచేస్తున్న అంబేడ్కర్​ పై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. అంబేడ్కర్ ప్రస్తుతం​ కొండాపూర్‌ లోని మేఘన లేక్‌ వ్యూ అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో ఉంటున్నాడు. ఈయనపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. తమకు అందిన ఫిర్యాదులతో రంగంలోకి దిగిన ఏసీబీ కేసు నమోదు చేసి సోదాలు చేపట్టింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)