వినియోగదారులు ఆర్డర్ చేసేటప్పుడు పోషక విలువలతో కూడిన ఆహారాన్ని ఎంచుకునేలా జొమాటో హెల్తీమోడ్‌ను తీసుకువచ్చింది. ఈ మోడ్‌తో ఎంచుకున్న ఆహారంలోని పోషక విలువల రేటింగ్‌ను తెలుసుకోవచ్చు. ఈ విషయాన్ని తెలియజేస్తూ జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్ ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. వినియోదారులు ఆహారాన్ని ఆర్డర్ చేసుకోవడాన్ని జొమాటో సులభతరం చేసింది. అయితే ఆరోగ్యానికి మేలు చేసే ఆహారం గురించి తెలియజేసే విషయంలో మాత్రం తగిన సదుపాయం లేదు. ఇది నన్ను ఆలోచింపచేసింది. ఈ లోపాన్ని సరిదిద్దేందుకు హెల్తీమోడ్‌ను తీసుకువస్తున్నాం. ఈ మోడ్‌లోని ప్రతీ వంటకానికి ఒక స్కోర్ ఉంటుంది. ప్రొటీన్లు, కాంప్లెక్స్ కార్బ్స్, ఫైబర్, మైక్రోన్యూట్రియెంట్స్ ఆధారంగా లో-సూపర్ స్కోర్ కనిపించనుంది. ప్రస్తుతం ఇది గురుగ్రామ్‌లో అందుబాటులోకి వచ్చింది. ఇతర నగరాల్లో సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురానున్నాం. దీనిని ప్రయత్నించండి. ఏవైనా లోపాలు ఉంటే చెప్పండి. మా మిషన్..'బెటర్ ఫుడ్ ఫర్ మోర్ పీపుల్' లక్ష్యానికి ఇది దగ్గరగా ఉందని నేను భావిస్తున్నాను'' అని రాసుకొచ్చారు. ప్రొఫెషనల్ అథ్లెట్లు కూడా ఆధారపడేలా తాము హెల్తీమోడ్‌ను రూపొందించామని వెల్లడించారు. యూజర్ల ఆరోగ్యంపై శ్రద్ధ చూపేలా గతంలోనూ జొమాటో ఒక ఫీచర్‌ను తీసుకువచ్చింది. ''ఉదాహరణకు.. మీరు నాన్‌ను ఎంపిక చేసుకొనేందుకు ప్రయత్నిస్తే ఆ సమయంలో నాన్‌కు బదులు రోటీ ఎంచుకుంటారా? అంటూ ఓ ప్రత్నామ్యాయ ఎంపికను చూపిస్తాం. లేదా మీకు ఏదైనా తీపి పదార్థం తినాలనుకుంటే తక్కువ కేలరీలు ఉన్న స్వీట్‌ను ఎంపిక చేసేందుకు ఫీచర్ తోడుంటుంది'' అని గోయల్ వెల్లడించిన సంగతి తెలిసిందే.
జొమాటోలో హెల్తీమోడ్ ఫీచర్ !
September 29, 2025
0
Tags