విశాఖపట్నంలో సోమవారం జరిగిన 'నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇ-గవర్నెన్స్' లో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ భవిష్యత్తు భారతదేశానికి ప్రత్యేక అవకాశం ఇస్తుందని, "కేవలం భారత్ మాత్రమే గ్లోబల్ కమ్యూనిటికి సర్వీసులు అందించగలదు" అని చెప్పారు. యూరప్, జపాన్ వంటి కొన్ని దేశాలు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్నాయి. ఆ దేశాల్లో టెక్నాలజీ ఉన్నప్పటికీ, దాన్ని ఉపయోగించడానికి కావలసిన నర్సులు, డాక్టర్లు, నిపుణులు లేరు. అందువల్ల, టెక్నాలజీ ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోతున్నారు. దీనివల్ల భవిష్యత్తు వేరే విధంగా ఉంటుంది, కేవలం భారత్ మాత్రమే ప్రపంచానికి సేవలు అందించగలదని అన్నారు. భారత్ మాత్రమే గ్లోబల్ కమ్యూనిటికి సర్వీసులు అందించగలదు. భారతదేశానికి ఇది ప్రత్యేక అవకాశం అని ఆయన అన్నారు. ఎందుకంటే, భారత్‌లో యువత ఎక్కువగా ఉన్నారు, 143 కోట్లు జనాభా వల్ల పని చేసే శక్తి, నర్సులు, డాక్టర్లు మరియు టెక్నాలజీ నిపుణులలో మంచి లభ్యత ఉంది. ఇది భవిష్యత్తులో భారత్‌ను గ్లోబల్ సర్వీసుల లీడర్‌గా మార్చగలదు. ప్రత్యేకంగా యువత ఉన్నందుకే భవిష్యత్తులో గ్లోబల్ సర్వీసెస్ రంగంలో ప్రత్యేక అవకాశాలు ఉన్నాయి. కానీ ఇది కేవలం జనాభా మాత్రమే కాకుండా, ఆ జనాభా యొక్క నైపుణ్యాలపై కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. ఐటీ, హెల్త్‌కేర్, ఫైనాన్స్, సర్వీసెస్ వంటి రంగాల్లో ప్రత్యేకంగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, స్కిల్స్ డెవలప్‌మెంట్ అవకాశాలు ఉండాలి. అలా చేస్తే, భవిష్యత్తులో భారత్ ప్రపంచానికి నైపుణ్యులు, నర్సులు, డాక్టర్లు, టెక్నాలజీ ఎక్స్‌పర్ట్స్ అందించగలదు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 'స్వదేశీ ఉద్యమం' ను ప్రోత్సహించినందుకు ప్రశంసించారు. "ముందుగా దేశీయ ఉత్పత్తులపై దృష్టి పెట్టి, పెద్ద బ్రాండ్లను సృష్టించాలి. తర్వాత గ్లోబల్ మార్కెట్ లో కూడా డిమాండ్ ను పెంచొచ్చు. ఇది త్వరలోనే సాధ్యమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటం కంప్యూటర్ల తయారీపై పెద్ద ప్రాజెక్ట్ తీసుకున్నట్లు చెప్పారు. ఐబీఎం, టీసీఎస్ వంటి పెద్ద కంపెనీలు భాగంగా ఉన్నాయని వివరించారు. చంద్రబాబు నాయుడు, "రెండు సంవత్సరాల్లో భారత్ క్వాంటం కంప్యూటర్లు తయారు చేసి, దేశీయంగా మరియు ఎక్స్‌పోర్ట్ లో వినియోగిస్తాం" అని తెలిపారు. అమరావతి క్వాంటం వ్యాలీగా మారుతోందని, జనవరి వరకు భారత్ క్వాంటం కంప్యూటింగ్ దేశాల క్లబ్ లో చేరబోతోందని చెప్పారు. కేవలం ఆరు-ఏడు దేశాలకే ఈ సామర్థ్యం ఉన్నదని, క్వాంటం వ్యాలీ + AI కలయిక 'డెడ్‌లీ కంబినేషన్' అని వ్యాఖ్యానించారు. ముఖ్యంగా, AI, మెషిన్ లెర్నింగ్, బ్లాక్ చైన్, క్వాంటం కంప్యూటింగ్ వంటి కొత్త టెక్నాలజీలు ప్రభుత్వాల ఆలోచన, విధానాల మార్పులో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. 2047లో, 22 సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా ఎదుగుతోందని ధీమా వ్యక్తం చేశారు.
భారత్ మాత్రమే గ్లోబల్ కమ్యూనిటీకి సర్వీసులు అందించగలదు !
September 22, 2025
0
Tags