బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం దక్షిణ ఒడిశా-గోపాల్‌పూర్ సమీపంలో తీరందాటింది. ఇది పశ్చిమ దిశగా ఛత్తీస్‌గఢ్ వైపు కదిలి బలహీనపడనుంది. కాగా తెలంగాణ ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టం నుంచి 7.6 కిలోమీటర్ల మధ్యలో ద్రోణి కొనసాగుతున్నది. వాయుగుండం, ద్రోణి ప్రభావంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు ఇరు రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది. మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. వాయుగుండం, ద్రోణి ప్రభావంతో శనివారం, ఆదివారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
తీరం దాటిన వాయుగుండం : కొనసాగుతున్న ద్రోణి
September 27, 2025
0
Tags