నేపాల్‌లోని ఖాట్మండులో ఆర్మీ హెడ్ క్వార్టర్స్ ముందు వర్గాలుగా విడిపోయిన జెన్ జెడ్ నేతలు పరస్పరం దాడులకు పాల్పడ్డారు. తాత్కాలిక ప్రధానిపై నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. బాలెన్ షా, సుశీలా కర్కి వర్గాలుగా విడిపోయిన నేతలు ఘర్షణకు దిగారు. ఆర్మీ ప్రధాన కార్యాలయం దగ్గర చర్చలకు వచ్చిన నేతల మధ్య గొడవలు చెలరేగాయి. నేపాల్ తాత్కాలిక ప్రధానిగా కుల్మాన్ ఘీషింగ్ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఎవరికి వాళ్లే నేతలుగా ప్రకటించుకోవడంతో నేపాల్‌లో అంతా గందరగోళంగా మారింది. చాలామంది నేతలు కుల్మాన్ ఘీషింగ్ వైపే మొగ్గు చూపుతున్నారు. నేపాల్ అధ్యక్షుడు రామచంద్ర పౌడేల్ ఇరువర్గాలు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. చర్చలతోనే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. నేపాల్‌లో హింస మధ్య, తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జోరుగా జరుగుతున్నాయి. తాత్కాలిక ప్రభుత్వంలో ప్రధానమంత్రి ఎవరు అనేది ఇంకా నిర్ణయించనప్పటికీ, కొత్త కొత్త పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఒక రోజు క్రితం వరకు, నేపాల్ మాజీ ప్రధాన న్యాయమూర్తి సుశీలా కర్కి ఈ రేసులో ముందంజలో ఉన్నారు. కానీ ఇప్పుడు కుల్మాన్ ఘిసింగ్ తాత్కాలిక ప్రధానమంత్రి అవుతారని దాదాపుగా ఖాయం అంటూ ప్రచారం జరుగుతోంది.
నేపాల్‌లో తాత్కాలిక ప్రధాని పదవి కోసం పరస్పరం దాడులకు పాల్పడ్డ జెన్ జెడ్ నేతలు !
September 11, 2025
0
Tags