ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ పున్నమి ఘాట్‌లో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి అయ్యాక తొలిసారి విజయవాడ పర్యటనకు రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఆంధ్రప్రదేశ్ దేశానికి అన్నపూర్ణలాంటిది. ఈ రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకెళ్తోంది. విజయవాడ హాట్ సిటీ, కూల్ పీపుల్. ఇది అభివృద్ధి చెందిన గొప్ప నగరంగా మారాలి. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం వికసిత్ ఆంధ్రప్రదేశ్ దిశగా దూసుకెళ్తోంది. ఈ పర్యటనను నా జీవితంలో మరిచిపోలేను. తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు చాలా గొప్పవి. ప్రజలందరికీ దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి. జై ఆంధ్రప్రదేశ్'' అని ఉపరాష్ట్రపతి అన్నారు.
విజయవాడ ఉత్సవ్‌లో పాల్గొన్న ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
September 24, 2025
0
Tags