ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యూరియా సరఫరాపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశం మధ్యలో జేపీ నడ్డాకు ఫోన చేశారు. కాకినాడ తీరానికి వచ్చే నౌకలో 7 వేగన్లను ఏపీకి కేటాయించాలని కోరారు. దీనిపై సానుకూలంగా నడ్డా స్పందించారు. దీంతో రాష్ట్రానికి 17,293 మెట్రిక్ టన్నుల యూరియాను కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలో అత్యవసరంగా యూరియా కోసం ఎదురుచూస్తున్న జిల్లాలకు యుద్ధప్రాతిపదికన యూరియాను పంపాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. రైతులకు ఎక్కడా యూరియా సమస్య లేకుండా చూడాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉందని మంత్రి అచ్చెన్నాయుడికి అధికారులు తెలిపారు. యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఎరువుల కేటాయింపు అంశంపై కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో ఫోన్‌లో సీఎం చంద్రబాబు మాట్లాడటం వలనే రాష్ట్రానికి యూరియా కేటాయింపు జరిగిందన్నారు.. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయికి వెళ్లి రైతులకు ఎరువులపై భరోసా ఇవ్వాలని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు. మరోవైపు రబీ సీజన్ కు కేంద్రం 9.3 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను రాష్ట్రానికి కేటాయించిందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.
17,293 మెట్రిక్ టన్నుల యూరియా కాకినాడ పోర్టులో దిగుమతికి కేంద్రం జీవో జారీ !
September 08, 2025
0
Tags