ఐఫోన్ 17 ప్రీ-బుకింగ్ ప్రారంభం !

Telugu Lo Computer
0


దేశంలో ఐఫోన్ 17 సిరీస్ కోసం ప్రీ-ఆర్డర్‌లను ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు అధికారికంగా యాపిల్ కంపెనీ ప్రారంభించింది. కస్టమర్లు యాపిల్ ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు ప్రధాన రిటైలర్‌ల ద్వారా ఐఫోన్‌ 17 సిరీస్‌ ఫోన్లను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. రిలయన్స్ డిజిటల్ (క్రోమా), విజయ్ సేల్స్ స్టోర్లలో ప్రీ-బుకింగ్ అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో త్వరలో అందుబాటులో రానుంది. అమెజాన్‌లో అయితే ఇప్పటివరకు ఏ ఆప్షన్ లేదు. డెలివరీలు సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభమవుతాయి. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్ ప్రీ-బుకింగ్ కోసం రూ.2,000 చెల్లించాల్సి ఉంటుంది. ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ కోసం రూ.17,000 చెల్లించి బుక్ చేసుకోవచ్చు. ప్రీ-బుక్ సమయంలో బ్యాంక్ క్యాష్‌బ్యాక్ ఆఫర్‌లు, నో-కాస్ట్ ఈఎంఐ, ట్రేడ్-ఇన్ ప్రయోజనాలు కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్నాయి. ప్రీ-డీల్స్యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డులపై రూ.5000 క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు. 6 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ ఎంపికను కూడా పొందవచ్చు. ఆపిల్ ట్రేడ్-ఇన్ కింద మీ పాత మొబైల్ ఎక్స్‌ఛేంజ్‌ చేసుకోవడం ద్వారా మరింత ఆదా చేసుకోవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)