భారతదేశంలో 'ఐఫోన్' 17 లాంచ్ ఈవెంట్ రాత్రి 10:30 గంటలకు ప్రత్యక్ష ప్రసారం

Telugu Lo Computer
0

ఫోన్ 17 లాంచ్ ఈవెంట్ యూఎస్‌లోని కుపెర్టినోలో జరుగుతుంది. భారతదేశంలో ప్రత్యక్ష ప్రసారం రాత్రి 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈవెంట్‌ను యాపిల్ వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్, యాపిల్ టీవీ యాప్‌లో చూడవచ్చు. ఈవెంట్ ముగిసిన అనంతరం రికార్డింగ్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈవెంట్‌లో యాపిల్‌ తన కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. ఈ ఈవెంట్ కోసం యాపిల్ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఐఫోన్ 17 సిరీస్ మోడల్స్, ధరలను మనం త్వరలోనే తెలుసుకోవచ్చు. ఐఫోన్ 17 సిరీస్‌లో ఐఫోన్ 17, ఐఫోన్ 17 ఎయిర్, ఐఫోన్ 17 ప్రో, ఐఫోన్ 17 ప్రో మాక్స్ ఉంటాయి. ప్లస్ మోడల్‌ను ఐఫోన్ 17 ఎయిర్ భర్తీ చేయనుంది. యాపిల్ స్మార్ట్‌ఫోన్ లైనప్‌లో ఎయిర్ భారీ మార్పు తేనుంది. 17 సిరీస్‌తో పాటు ఆపిల్ వాచ్ అల్ట్రా 3, ఆపిల్ వాచ్ సిరీస్ 11, వాచ్ SE 3, ఎయిర్‌పాడ్స్ ప్రో 3లను కూడా లాంచ్ చేయవచ్చు. ఐఫోన్ 17 ఎయిర్ అత్యంత సన్నని మోడల్ అని సమాచారం. ఈ ఫోన్ మందం కేవలం 5.5mm మాత్రమే అని తెలుస్తోంది. ఇందులో 6.6-అంగుళాల స్క్రీన్, ఒకే ఒక కెమెరా ఉండనుంది. ఐఫోన్ 17 ప్రో మాక్స్ పెద్ద బ్యాటరీతో కాస్త మందంగా ఉండనుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)